Sunday, 17/12/2017 | 10:01 UTC+0
 TRUTH..SEARCH

అతడొక్కడే.. ఎందరికో స్ఫూర్తి ..!

నెలకు లక్షకు పైగా సంపాదన. హాయిగా జీవితం. కోరిన కోర్కెలు తీరే వెసలుబాటు. బతికేందుకు కావాల్సినంత డబ్బులు వున్నా. వాటినన్నిటిని వదులుకున్నాడు. తన వారిని , అయిన వారిని , ఆదరించిన వారిని గుర్తు పెట్టుకున్నాడు. తన ప్రతిభకు అమెరికాలో అవకాశం వచ్చినా కాదన్నాడు. ఒకరి కింద బానిసగా బతకటం కంటే ఒంటరి పోరాటమే మేలని ముందుకు కదిలాడు. వ్యక్తి నుండి వ్యవస్థగా ఎదిగాడు నాగర్ కర్నూల్ కు చెందిన మాల్గామ్ సుభాష్ గౌడ్. ఇప్పుడు అతడిలో అంతులేని నమ్మకం. ఎంసీఏ వరకు చదివిన సుభాష్ ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కున్నాడు. అయినా వెనక్కి తగ్గలేదు . ఏదో ఒక రోజు తాను పది మందికి అన్నం పెట్టే స్థాయికి చేరుకుంటానని ప్రయత్నం చేసాడు. అది ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. ఎందరికో ఉపాధి ని చూపిస్తోంది . వేరెవ్వరో చెబితే వినాల్సిన కథ కాదు . మన కళ్ళ ముందు కనిపించే వాస్తవం.

ఒకరి ట్రెండ్ ను ఎందుకు ఫాలో కావాలని తానే ఎందుకు బ్రాండ్ కాకూడదని ట్రై చేసాడు. గెలుపు శిఖరాన్ని అందుకున్నాడు. అంతా ఐటి బాట పడితే మనోడు డిజిటల్ మార్కెటింగ్ రంగాన్ని ఎంచుకున్నాడు. తన అనుభవాన్ని రంగరించి తానే కొత్తగా మహబూబ్ నగర్ లో డిజిటల్ మార్కెటింగ్ Institute  ను 2015 లో ఏర్పాటు చేసాడు . మొదట్లో కొద్దిగా ఇబ్బంది పడినా ఆ తర్వాత విద్యార్థులు రావటం మొదలైంది . 300 మందికి పైగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ లుగా తీర్చి దిద్దాడు . 90 శాతం మంది జాబ్స్ దక్కించుకుంటే మిగతా 10 శాతం మంది ఆన్ లైన్లో యూట్యూబ్ ద్వారా నిజాయితీగా , తమ తెలివితో క్రియేటివిటీ తో డబ్బులు సంపాదిస్తున్నారు. తమ కాళ్ళ మీద తాము నిలబడ్డారు .

                                            ఇదే స్పూర్తితో సుభాష్ మరో ప్రయోగం చేసాడు . అదే ఏడాది డిసెంబర్ లో డయల్ పాలమూరు (www.dialpalamuru.com) అనే సంస్థను ప్రారంభించాడు . దీని ద్వారా ఆన్ లైన్లో నే Cab Booking, Order Food Online, Online kirana , కేక్స్ , ఫుడ్ ఐటమ్స్ , ప్లంబర్లు , పెయింటర్స్ , ఇలా రోజు వారి కుటుంబాలకు అవసరమైన వస్తువులు , వ్యక్తులు లభించేలా ఒక వేదికగా దీనిని మలిచాడు. స్టార్ట్ చేసిన మొదటి ఏడాది లోనే 4 లక్షల రూపాయల టర్నోవర్ సాధించాడు . 2017 లో 10 లక్షలు వస్తాయని అంచనా వేస్తున్నాడు . Kurnool , Shadnagar లో కూడా బ్రాంచ్ లు ఏర్పాటు చేసాడు . కొత్తగా మరో 10 చోట్ల శ్రీకారం చుట్టనున్నారు . తిరుపతి,విజయవాడ , వరంగల్, కరీంనగర్, వైజాగ్, అమరావతి, గుంటూరు, భీమవరం, నాగర్కర్నూల్,వనపర్తి లో స్టార్ట్ చెయ్యడానికి రెడీ  గా ఉన్నాడు. ఈ ప్లేసెస్ లో ఫ్రాంచైసీ అవకాశం ఇచ్చి లోకల్ పీపుల్ ని కూడా బిజినెస్ లో భాగం చేస్తున్నాడు .

                         

సుభాష్ మహబూబ్ నగర్లో ఒక సంచలనం . ఎవరైనా గుర్తు పడతారు . అంతగా తన సంస్థను తీర్చిదిద్దాడు . అందుకోసం అహర్నిశలు కృషి చేసాడు .వెబ్ సైట్స్ రూపకల్పన , డిజిటల్ మార్కెటింగ్ , SEO , Google Analytics , Email Marketing, Google Adwords, Blogging, SMo and SMM ఇలా ఎన్నో కోర్సులు ఇందులో ఉన్నాయి . దగ్గరుండి చెప్పటమే కాదు ..చేసి చూపిస్తాడు . ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ గా అభ్యర్థులకు మరింత తమ మీద నమ్మకాన్ని పెంచుతున్నాడు . అతడి దగ్గర నేర్చుకున్న వాళ్ళు 10 వ తరగతి నుండి పీజీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు . సబ్జెక్టు లేకున్నా , కంటెంట్ రాకపోయినా , ప్రకటనలతో జిమ్మిక్కులు చేసే వాళ్ళకంటే సుభాష్ శిక్షణ బెటర్ అని చెప్పాలి . ఎవరి సహకారం లేకుండా స్వశక్తితో సంస్థగా ఎదిగిన సుభాష్ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది .

                                             ఎవరిని అనుకరించకండి . విలువైన కాలాన్ని గుర్తించండి . ఎక్కడో ఎవరో చెబితే మీ నిర్ణయాలు మార్చుకోకండి . మీ మీద మీరు నమ్మకంతో ముందుకు కదలండి . అసాధ్యాలను సుసాధ్యం చెయ్యొచ్చు అంటాడు. వేలకు వేలు ఖర్చు చేసే బదులు బతుకును వెలిగించే డిజిటల్ మార్కెటింగ్ కోర్సులను ఎంచుకుంటే యువతకు ఇబ్బందులు తొలగిపోతాయి . సక్సెస్ అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు . నిరంతరం శ్రమిస్తే వచ్చేది . ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉండాలీ . అది ఎంత ఎత్తులో వుంటే అంత బలాన్ని కూడ దీసుకోవాలి . మారుతున్న కాలానికి నిచ్చెన లాంటిది డిజిటల్ మార్కెటింగ్ . భవిషత్తు అంతా దీనిలోనే ఉంది . యువతీ యువకులు ఒక్కసారి సుభాష్ ను కలవండి . అతడితో మాట్లాడండి . మీలో మార్పు రావటం ఖాయం . మీ లైఫ్ కు అతడు తన ప్రతిభతో భరోసా కల్పిస్తాడు . అంతులేని గెలుపును మీకు అందిస్తాడు . పోతే పోయేది ఏముంది జస్ట్ ట్రై చేసి చూడండి .Subhash Malgam Contact Number 9010-607-708

You can Also Watch Mahabubnagar’s First Ever Pramotional Short Film on Digital Marketing  By Deva Ponakanti

About

POST YOUR COMMENTS

Your email address will not be published. Required fields are marked *